Header Banner

స్కైప్‌కు ఇక సెలవు! టీమ్స్‌కే ఫోకస్ చేస్తున్న మైక్రోసాఫ్ట్!

  Sat May 03, 2025 09:31        Business

దాదాపు రెండు దశాబ్దాలుగా వీడియో కాలింగ్ సేవలు అందించిన స్కైప్ ఇకపై కనుమరుగు కానుంది. కరోనా సమయంలో ఈ టెక్నాలజీ సర్వీస్ బాగా ప్రాచుర్యం పొందింది. కోవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను విరివిగా ఉపయోగించారు. అయితే, కోవిడ్ అనంతరం యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్‌లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం, మైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ వేదికలను ఏకీకృతం చేయడంతో స్కైప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మే 5 నుంచి స్కైప్ సేవలను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించింది. స్కైప్ యూజర్లను మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.

మెసేజింగ్, వీడియో కాల్స్ వంటి ఇతర సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్ తన ప్రాథమిక వేదికగా టీమ్స్‌పై దృష్టి పెడుతోంది. స్కైప్ యూజర్లను సైతం టీమ్స్‌లో చేరమని కొంతకాలంగా కోరుతోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లు టీమ్స్‌కు మారిపోయారు. స్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ వంటి పోటీదారులు కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఆఫీసు 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు యూజర్లను నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. స్కైప్ నుంచి టీమ్స్‌కు మారేందుకు యూజర్లకు మైక్రోసాఫ్ట్ చాలా నెలల సమయం ఇచ్చింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని కూడా మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, సమగ్ర అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoodbyeSkype #MicrosoftTeams #TechUpdate #SkypeShutdown #MicrosoftNews #VideoCalling #DigitalShift